నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాలు.. ప్రారంభమైన ఓట్ల లెక్కింపు

  • పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ మధ్య తీవ్రమైన పోటీ
  • తమిళనాట నటుడు విజయ్ పార్టీతో ముక్కోణపు పోటీ
  • కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య హోరాహోరీ పోరు
  • అసోంలో హ్యాట్రిక్ కోసం బీజేపీ, పుదుచ్చేరిలో అధికారం నిలబెట్టుకోవాలని ఏఐఎన్ఆర్‌సీ ప్రయత్నం
దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరిలో ప్రజలు ఇచ్చిన తీర్పు మరికొన్ని గంటల్లో వెలువడనుంది. సాయంత్రానికి ఏ పార్టీ అధికార పీఠాన్ని దక్కించుకుంటుందో స్పష్టత రానుంది.

కాగా, అందరి దృష్టి పశ్చిమ బెంగాల్‌పైనే కేంద్రీకృతమై ఉంది. ఇక్కడ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. రాష్ట్ర ఓటర్ల జాబితా నుంచి దాదాపు 89 లక్షల మంది పేర్లను తొలగించడంపై మమత ఎన్నికల సంఘంతో విభేదించారు. ఈ సంఖ్య 2021లో టీఎంసీ సాధించిన మెజారిటీ కంటే ఎక్కువ కావడంతో ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

తమిళనాట ఈసారి ముక్కోణపు పోటీ నెలకొంది. అధికార డీఎంకే-కాంగ్రెస్ కూటమి, అన్నాడీఎంకే-బీజేపీ కూటమితో పాటు ప్రముఖ నటుడు విజయ్ కొత్తగా స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) పార్టీ కూడా బరిలో ఉండటం ఆసక్తిని పెంచుతోంది.

ఇక, కేరళలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని లెఫ్ట్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్) ప్రయత్నిస్తుండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తరచూ తప్పుతుంటాయి. అసోంలో బీజేపీ హ్యాట్రిక్ విజయంపై ఆశలు పెట్టుకోగా, పుదుచ్చేరిలో ఎన్. రంగస్వామి నేతృత్వంలోని ఏఐఎన్ఆర్‌సీ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది.

Counting Of Votes
Assembly Elections 2026
West Bengal Elections
Tamil Nadu Elections
Kerala Elections
Assam Elections
Puducherry Elections
Mamata Banerjee
DMK
BJP
Election Results

More Telugu News